మైకం
Date: 31 Dec 2018
Language : Telugu
Language : Telugu
మైకం
నిజమేనా? నిజమేనా?
లేక ఊహల్లో విహరిస్తున్నా??
నిలువరించలేని నా ఊహల్లో,
వదలక విహరిస్తున్నానా?
వేయి వన్నెల విచిత్ర లోకంలో,
మైకం తప్పి విహరిస్తున్నానా?
తుద లేని, కడ లేని
మాయల లోకంలో విహరిస్తున్నానా?
మబ్బు కమ్మెనా? మసక కమ్మేనా?
మనసుకంటిన మాయ కమ్మెనా ??
విలువలు వెలవెల బోయినా,
నీ మత్తు మాత్రం వీడునా??
సమయపు సడి అంచులలో,
నడి సంద్రపు ధారలలో,
జీవపు సెలయేరులలో,
తక్కిన అర్థార్థములలన
నీ బ్రతుకు కుడా పోయెనా?
Comments
Post a Comment