Telugu Translation of 'Still I rise' by Maya Angelou

 Translation of  'Still I rise'

Original: Maya Angelou, English

Translation into Telugu 

మళ్ళీ నేను లేస్తాను

చరిత్రలో నా గురించి నువ్వు చెడుగా రాయవచ్చు

నీ చేదైన వంకర మాటలతో నా గురించి చెప్పవచ్చు

నన్ను నువ్వు బురదలో పడవేయవచ్చు

కానీ ఎగసిపడే దుమ్ము వలె మళ్ళీ నేను లేస్తాను!

 

నా చిలిపితనం నిన్ను బాధిస్తోందా?

చమురు బావులేవో మా ఇంట్లో పొంగుతునట్టు

నేను దర్పంగా నడుస్తుంటే

నువ్వెందుకు బాధలో కూరుకుపోయావు?

 

అచ్చం సూర్య చంద్రులలా,

ఎగిరిపడే సంద్రపు కెరటాలలా,

ఉవ్వెత్తున ఎగిసే ఆశలలా,

మళ్ళీ నేను లేస్తాను!

 

నేను బాధ పడటం చూడాలనుకుంటున్నవా?

ఆత్మగౌరవాన్ని తుంచాలనుకుంటున్నావా?

సత్తువ లేని బలహీనమయిన బాధతో

నా భుజాలు కన్నీళ్ళలా జారుతున్నాయా?

 

నా అహంకారం నిన్ను బాధిస్తోందా?

నా ఇంటి వెనుకేదో గనుల నుండి నాకోసమే

బంగారు తవ్వుతున్నట్టు నేను నవ్వుతున్నట్టుగా

మరీ అంతగా బాధ పడకులే!

 

నీ మాటల తూటాలతో నన్ను పేల్చేయవచ్చు

నీ కంటి చూపులతో నన్ను కోసేయవచ్చు

నీ భావ ద్వేషాలతో నన్ను చింపేయవచ్చు

కానీ యీ గాలి వలె, మళ్ళీ నే లేస్తాను!

నా పరువం నిన్నంతగా బాధిస్తోందా?

వజ్రాలను నా హొయలలో దాచుకున్నట్లుగా

నేను నాట్యమాడుతుంటే

నీకు ఆశ్చర్యంగా ఉందా?

 

చరిత్రలో సిగ్గుతో కట్టిన గుడిసెలలో నుండి

నేను లేస్తాను

నొప్పితో నాటుకు పోయిన గతంలో నుండి

నేను లేస్తాను

హెచ్చుతగ్గులను కెరటంలో బరిస్తున్న,

పారి దూకుతున్న నల్లని సముద్రాన్ని నేను!

 

భయ భీభత్సాలు కలిగిన రాత్రులను వదలి

నేను లేస్తాను

స్పష్టంగా కనిపించే అద్భుతమైన పగటిలా

నేను లేస్తాను

నా పూర్వీకులిచ్చిన బహుమతులు తీసుకువచ్చిన

బానిసల కలను మరియు ఆశను నేను!

నేను లేస్తాను!

నేను లేస్తాను!!

నేను లేస్తాను!!!

Comments

Popular posts from this blog

The Heart Touched Words

రహస్యం